11వ వధూవరుల వివాహ పరిచయ వేదిక పుస్త కావిష్కరణ


 తేది 27.11.2020 రోజు న స్థానిక వాసవీ విద్యార్థి వసతి గృహంలో ఉమ్మడి జిల్లా అవోపా ఆధ్వర్యంలో 11వ వధూవరుల వివాహ పరిచయ వేదిక పుస్త కావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకట్రావ్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి మంచి ప్రాయోజిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న అవోపా సభ్యులను వారు అభినందించారు. అనంతరం నిర్వాహకులు కలెక్టర్ గారిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కలకొండ సూర్యనారాయణ, కార్యదర్శి రాజయ్య మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంది శ్రీని వాస్, పాపిశెట్టి మురళీకృష్ణ, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బిల్లకంటి రవి కుమార్, కందికొండ శ్రీనివాసులు విద్యార్థి వసతి గృహ ప్రధాన కార్యదర్శి కొండా చక్రాధర్ గుప్త, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సాయికిషోర్ రేగూరి కృష్ణ. కొట్ర శ్రీనివాస్, శివ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేసిన నిర్వాహకులను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి. 


కామెంట్‌లు