ఈ వారం రాశి ఫలితాలు తేదీ 4 అక్టోబర్ నుండి అక్టోబర్ 10 , 2020 వరకు
......
మేష రాశి
ఈ వారం ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త పనులు చేపట్టి అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభ రాశి
ఈ వారం చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలు కొంత నిరాశ పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథున రాశి
ఈ వారం మొదట్లో ఇబ్బంది పడినా క్రమేపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయటా పరపతి పెరుగుతుంది. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుని ఊరట చెందుతారు. ఉద్యోగవర్గాలకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
కర్కాటక రాశి
ఈ వారం సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి శ్రమ పడ్డా ఫలితం దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి జాగ్రత్త వహించండి. కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ప్రతిబంధకాలు తొలగుతాయి.
సింహరాశి
ఈ వారం ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి, లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అమితోత్సాహం, శుభవార్తలు. ముఖ్యమైన కొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని రుణాలు సైతం తీరే అవకాశం. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కన్యారాశి
ఈ వారం ఉద్యోగాలలో మరింత అనుకూలత. రాజకీయవర్గాలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ప్రముఖులతో ఊహించని పరిచయాలు. కుటుంబంలో శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగి పెట్టుబడులు అందుకుంటారు.
తులా రాశి:
ఈ వారం వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. బంధువులతో విభేదాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది.
వృశ్చికరాశి
ఈ వారం కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఉద్యోగలాభం.. సోదరులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సురాశి
ఈ వారం శ్రమ మీది ఫలితం .ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. కొన్ని ముఖ్య కాంట్రాక్టులు చేజారవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు నెలకొని సమస్యగా మారవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. కుటుంబసభ్యుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. వారం మధ్యలో ధనప్రాప్తి.
మకరరాశి
ఈ వారం వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు కార్యసిద్ధి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తీరతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనసౌఖ్యం. ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు. ధనవ్యయం.
కుంభరాశి
ఈ వారం అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా అద్భుతమైన వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, పదవులపై కొత్త ఆశలు.
మీన రాశి
ఈ వారం వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తొలగుతుంది. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వివాహాది శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇతరుల సమస్యలు సైతం పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. వారం చివరిలో వ్యయప్రయాసలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి