మహాత్మా గాంధీకి జమ్మికుంట అవోపా నివాళులు


నేటి ఉదయం 9 గంటలకు జమ్మికుంట గాంధీ చౌక్ లో మహాత్మా గాంధి విగ్రహానికి పాలాభిషేకం చేసి ,పూలమాలలతో అలంకరించడం జరిగింది. గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడి, నివాళులు అర్పించడం జరిగింది.


   గాంధీజీ దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రాన్ని సంపా దించి పెట్టారన్నారు ఆ వో పా , జమ్మికుంట అధ్యక్షులు అయిత సుధాకర్.గాంధీజీ సత్యం,ధర్మం, అహింసా సిద్ధాంతాలను అనుసరించడం నిజమైన నివాళులు అని వారు చెప్పారు.


     అనంతరం స్పందన అనాధా శ్రమం లోని విద్యార్థులకు పళ్లు పంపిణీ చేయడం జరిగింది.


    ఈ కార్యక్రమంలో అవో పా అధ్యక్షులు అయిత సుధాకర్,ప్రధాన కార్యదర్శి బాదం సురేష్ బాబు, కోశాధికారి కే ఆర్ వి నర్సయ్య ,రాంబాబు,నగేష్,చంద్ర గుప్త, ప్రభాకర్ రమేష్ బాబు, సురేందర్మొదలైన వారు పాల్గొన్నారు.


కామెంట్‌లు