పురస్కారాలు


టౌన్ అవోపా ఆత్మకూర్ వారు తేది 25.10.2020 రోజున చదువులలో ఉత్తమ ప్రతిభ కనపరచిన ఆర్యవైశ్య విద్యార్థినీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2020 సంవత్సరం నకు గాను  ప్రతిభా పురస్కారాలు మరియు మెడల్స్ అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు పట్టణ అవోపా అధ్యక్షులు శ్రీ నంచర్ల శివరాజు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 10 వ తరగతి లో 10/10 సాధించిన 7 గురు విద్యార్థులకు ఇంటర్ లో 950 పైగా  మార్కులు సాధించిన 4 గురు విద్యార్థులకు పాలిసెట్ లో 3500 ర్యాంకు సాధించిన ఒక విద్యార్థి కి  మొత్తం 12 మంది విద్యార్థులకు మెడల్స్ ను అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు కట్ట చంద్రశేఖర్ గారు వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి దోమ శ్రీనివాసులు గారు జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ వై. వెంకటేష్ అదేవిధంగా చీఫ్ గెస్ట్ కోదండ రామయ్య గారు జూనియర్ లెక్చరర్ జడ్చర్ల వారు రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో లో పట్టణ అవోపా మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. 


కామెంట్‌లు