అభినందనలు

అవోపా ఉట్నూరు సభ్యుడు శ్రీ తంగేడిపల్లి బాలాజికి 2011లో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉట్నూరు లో పనిచేయుచూ పాఠశాల యొక్క పచ్చదనం పరిశుభ్రత పై శ్రద్ధ వహించి, విద్యార్థులకు డిజిటల్ క్లాస్లలో విద్యాబోధన చేశాసి, పదవ తరగతి యందు 100 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణు లవడానికి కృషి చేశారు. ఇతను క్రమశిక్షణగా ఉంటూ విద్యార్థులను కూడా క్రమశిక్షణ గా ఉండేటట్లు చేశారని వీరి సేవలను గుర్తించి ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ వారు వీరిని జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు 2020 గా ఎంపిక చేసి ప్రశంసా పత్రాన్ని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు అందజేశారు. వివరాలలోకెళ్తే వీరు సిర్పూర్ కాగజ్నగర్ వాస్తవ్యులు . ప్రాథమిక విద్యాభ్యాసం సిర్పూర్ లో చేసి హైదరాబాద్ లో బి.ఎడ్ పూర్తి చేసి మొదటగా ఆసిఫాబాద్ మండలం టీచర్గా 1995 లో నియమించబడి, అచట పనిచేస్తూ మండల ఉత్తమ ఉపాధ్యాయిడిగా ఎన్నికైనారు. తర్వాత భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా 2000లో పదోన్నతి పొంది స్కూల్ అసిస్టెంట్ గా మందమర్రి ZPSS పాఠశాలలో పని చేస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దారు. ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ గారి చే సన్మానింప బడిన వీరికి తోటి ఉపాధ్యాయులు అవోపా ఆదిలాబాద్ వారు సన్మానించారు. వీరిికి రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి.


కామెంట్‌లు