నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ

🌟 *సెప్టెంబర్ 14, 2020* 🌟


      *_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*


     *దక్షిణాయణం* *వర్ష ఋతువు* 


   *భాద్రపద మాసం* *బహుళ పక్షం* 


తిధి : *ద్వాదశి* రా10.01


                తదుపరి త్రయోదశి            


వారం : *సోమవారం* (ఇందువాసరే)


నక్షత్రం : *పుష్యమి* మ1.22


               తదుపరి ఆశ్లేష/ఆశ్రేష          


యోగం : *పరిఘము* మ12.28


                 తదుపరి శివం


కరణం : *కౌలువ* ఉ10.27


                తదుపరి *తైతుల* రా10.01


            ఆ తదుపరి గరజి  


వర్జ్యం : *రా1.55 - 3.30* 


దుర్ముహూర్తం : *మ12.20 - 1.09* &


                         *మ2.47 - 3.36*


అమృతకాలం : *ఉ6.57 - 8.33*               


రాహుకాలం : *ఉ7.30 - 9.00*


యమగండం/కేతుకాలం: *ఉ10.30 - 12.00*


సూర్యరాశి: *సింహం* | చంద్రరాశి: *కర్కాటకం*


సూర్యోదయం: *5.50* | సూర్యాస్తమయం: *6.౦౩*   


 *సర్వే జనాః సుఖినో భవంతు* 


 *శుభమస్తు*🙏


        *_గోమాతను పూజించండి_*


నేటి రాశిఫలాలు


తేది: 14-09-2020


శ్రీ గురుభ్యోనమః


 


మేషం: 


ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.


కుజ - పేద చేనేత కార్మీకులకు సహాయం చేయండి.


 


వృషభం:


 విచిత్ర సంఘటనలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.


గురు - రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయండి.


 


మిథునం: 


కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆదరణ లభిస్తుంది. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.


శని - తేనే తో శ్రీ వేంకటేశ్వర స్వామికి అభిషేకం చేయండి.


 


కర్కాటకం: 


శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.


శని - రొట్టె ముక్కలను వీధి కుక్కలకు ఆహారంగా వేయండి.


 


సింహం: 


వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.


గురు - గురు గ్రహ అర్చన చేయండి.


 


కన్య: 


పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.


కుజ - దేవాలయం లో జవ్వాది కస్తూరి ఇవ్వండి.


 


తుల: 


కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.


శుక్ర - ఏనుగుతో కూడుకుని వున్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేయండి.


 


వృశ్చికం: 


కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.


బుధ - గణపతి కి లడ్డూలు నివేదన చేయండి.


 


ధనుస్సు:


 శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.


చంద్ర - శివ పంచాక్షరీ జపం చేయండి.


 


మకరం: 


 వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.


రవి - ఆదిత్య హృదయం పారాయణం చేయండి.


 


కుంభం: సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.


బుధ - విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి.


 


మీనం: 


దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. సోదరులు, సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.


శుక్ర - మహాలక్ష్మీకి గోధుమ నూక తో తయారు చేసిన పాయసం నివేదనం చేయండి.


హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం


జై శ్రీమన్నారాయణ


జై శ్రీ రామ్


కామెంట్‌లు