కోలేటి దామోదర్ చే WAM e-book ఆవిష్కరణ
ప్రపంచ వ్యాప్త ప్రశంసలు
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ, గ్లోబల్ లిటెరరి ఫోరమ్ ఆధ్వర్యంలో 'కవిరత్న' డాక్టర్ చింతల శ్రీనివాస్ చైర్మన్ గా , గ్లోబల్ లిటెరరి ఫోరమ్ సారథ్యంలో ''ఇ-బుక్'' ఆవిష్కరణను గౌరవనీయులు కోలేటి దామోదర్, చైర్మన్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ వారు గావించారు. WAM GLF "అంతర్జాల ప్రపంచ కవి సమ్మేళనంలో" ప్రపంచ వ్యాప్తంగా (102) మంది మహా కవులు, కవులు, కవయిత్రులు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో (5) గంటలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని "అద్భుతం" అనిపించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తి ప్రత్యేక ప్రశంసా అభినందనలు పంపారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి మొదలైన అనేక సాహితీ అతిరథ, మహారథులు కొనియాడారు. అఖండ విజయం సాధించిన ఈ కార్యక్రమానికి WAM గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా, ప్రముఖ కవి ఏనుగు నర్సింహారెడ్డి గారు, ఆడిషనల్ కలెక్టర్ కరీంనగర్ జిల్లా గారు విశిష్ట అతిథిగా హాజరై కార్యక్రమం ఎంతో స్ఫూర్తి దాయకమని ఎందరికో విశ్వవ్యాప్తంగా ఆదర్శనీయమని అభినందించారు. ప్రపంచ రికార్డుల గ్రహీత 'కవిరత్న' డాక్టర్ చింతల శ్రీనివాస్, కన్వీనర్ గా, డాక్టర్ బండారు సుజాతా శేఖర్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. ఈ ప్రపంచ స్థాయి కార్యక్రమ గ్లోబల్ కమిటీ ప్రజా సంబంధ అధికారిగా నూకా యాదగిరి గారు సమర్థవంతం గా వ్యవహరించారు.
"కవితా క్రాంతి...ఆరోగ్యక్రాంతి" అన్న శీర్షికతో జరిగిన ప్రపంచ స్థాయి కవి సమ్మేళనం ప్రపంచ వ్యాప్త ప్రశంస లందుకుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి