కృతజ్ఞతాభి వందనములు


తెలంగాణ రాష్ట్ర అవోపా నిర్వహించుచున్న అవోపా న్యూస్ బుల్లెటిన్ చందాదారుల కమిటీ చైర్మన్ గా నియమింపబడి గత 3 సంవత్సరముల నుండి విశేష కృషి సలుపుతూ సుమారు 36 మంది వార్షిక మరియు జీవితకాల సభ్యులను చేర్పించి సుమారు రూ.7,200 లు, వివాహ ప్రకటలు, ఇతర వాణిజ్య ప్రకటనలు 25 ఇప్పించి సుమారు రూ.18,500లు వసూలు చేసి, వనపర్తి జిల్లాలో బులెటిన్ కు అధిక ప్రాధాన్యత కల్పించి సుమారు పది పెళ్లిళ్లు జరగడానికి విశేష కృషి చేసి, పెళ్లిళ్లు జరిగిన వధూవరుల కుటుంబాల నుండి అనగా శ్రీ గోవింద్ గుప్త నుండి రూ.5016, శ్రీ ఎల్.రమణ రూ2516, శ్రీ రాఘవేంద్ర రూ.2000, శ్రీ రవీందర్ రూ.3116, శ్రీమతి ఝాన్సీ రూ.5000, శ్రీ ఉదయ శంకర్ రూ.3000, శ్రీ రామచందర్ రావు రూ.3500లు మొత్తము రూ.24148 లు బులెటిన్ కు కార్పస్ ఫండ్ సేకరించి రాష్ట్ర అవోపా బ్యాంకు ఖాతాలో జమచేసి, అవోపా న్యూస్ బులెటిన్ సౌలభ్యమ్ కోసం సుమారు రూ.38,500లు విలువజేసే 3ర్డ్ జనరేషన్ కంప్యూటర్ ను మరియు అల్ ఇన్ వన్ wifi ప్రింటర్ ను శ్రీ నూకల భాస్కర్, శ్రీ కటకం వెంకటేశ్వర్లు, శ్రీ ఇల్లెందుల విశ్వనాథం, నవీన్ టైలర్స్, ఎమ్. మదన్ మోహన్ మరియు ఎమ్. ఎన్. రాజకుమార్ గారల సహకారంతో ఖరీదు చేసి తెలంగాణ రాష్ట్ర అవోపా కు బహూకరించిన న్యాయవాది/నోటరి, అవోపా న్యూస్ బుల్లెటిన్ చందాదారుల కమిటీ చైర్మన్, అఖిల భారత అవోపాల ఫెడరేషన్ కమిటీ సభ్యుడు, శ్రీ ఎం.ఎన్. రాజకుమార్ గారికి మరియు వనపర్తి జిల్లా అవోపా కార్యవర్గానికి, బులెటిన్ కు చందాలు నొసంగి సభ్యులుగా చేరిన చందాదారులకు, వివాహ మరియు వాణిజ్య ప్రకటనలు ఇఛ్చిన మిత్రులకు మరియు నూతన వధూవరులకు మరియు బులెటిన్ కు కార్పస్ ఫండ్ చెల్లించిన వారలకు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు, కార్యదర్శులు నిజాం వెంకటేశం, చింతా బాలయ్య, పోకలచందర్, గుండా చంద్రమౌళి, మునుగోటి సత్యనారాయణ, కార్యవర్గ కమిటి మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు నూకా యాదగిరి మరియు కూర చిదంబరం కృతజ్ఞతాభి వందనములు తెలియజేస్తూ దాతల సహాకారము ఇలాగే ఎల్లప్పుడూ కొనసాగాలని, బులెటిన్ స్వయం ప్రతిపత్తికి తమ వంతు సహాయమందించాలని విజ్ఞప్తి చేయుచున్నారు.కామెంట్‌లు