ప్రైవేట్ ఉపాధ్యాయులకు చేయూత


ఈరోజు ఉదయం 12 గంటలకు నాగర్ కర్నూల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాగర్కర్నూల్ యూనిట్అవోపా ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ముగ్గురు ఆర్యవైశ్య ప్రైవేట్ ఉపాధ్యాయులు శ్రీమతి కల్పన, అర్చన మరియు శ్రీలక్ష్మి గార్లకు మొత్తం 13 వేల రూపాయలు (దాతల సహాయంతో 7000, మన యూనిట్ తరపున ఆరు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేయబడింది. Covid 19 దృష్ట్యా పాఠశాలలు నడవడం లేదు కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఆర్యవైశ్య ఉపాధ్యాయులకు సహాయం చేయడం అభినందనీయమని అవోపా రాష్ట్ర మరియు జిల్లా నాయకులు యూనిట్ అధ్యక్షులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బిల్ల కంటి రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీధర్ జిల్లా యూనిట్ అధ్యక్షులు ఫణి కుమార్ ప్రధాన కార్యదర్శి సాయి శంకర్ ఆర్థిక కార్యదర్శి రవిప్రకాశ్ సీనియర్ అవోపా సభ్యులు బొడ్డు పాండు రాజయ్య కందూరు బాలరాజు అనంత స్వామి రాఘవేందర్ మొదలైన వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 


 


కామెంట్‌లు