అవోపా మంచిర్యాల వారిచే ఉచిత వెంటిలేటర్ సేవలు ప్రారంభం


కారోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రజలు అతలాకుతలమౌతున్న సందర్భంలో, బీద ప్రజలకు వైద్యం అందక, వెంటిలేటర్లు అందుబాటులో లేక అవస్థలు పడుచున్న సమయంలో, అవోపా మంచిర్యాల వారు 'బొబైల్' అను ఆక్సిజన్ యంత్రాన్ని రూ.40,000ల తో ఖరీదు చేసి బీద ప్రజల అవసరార్థం గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు నడిపెళ్లి దివాకర్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు ఆక్సిజన్ యంత్రం ప్రారంభించారు. ఎమ్.ఎల్.ఏ గారు మాట్లాడుతూ అవోప మంచిర్యాల సేవలు మారువలేనియని కోవిడ్19 లో 51 రోజులు నిత్యం అల్పాహారం, భోజనాలు పేద ప్రజలకు అందించి, ఇప్పుడు కరోనాతో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా ఆక్సిజన్ సరఫరా యంత్రం (వెంటిలేటర్)ను కొనుగోలు చేసి సేవచేయడం గొప్పవిషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, అధ్యక్షులు టి. సత్యవర్ధన్, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ గారు మాట్లడుతూ ఈ యంత్రం ఏకధాటిగా 8 గంటలు పనిచేస్తుందని, ఇది కేవలం మంచినీరు తో నడుస్తుందని, పేద వారు హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టుకుంటే రోజుకు రూ.10,000 ఛార్జ్ చేస్తున్న తరుణంలో ఈ యంత్రం ద్వారా ఆక్సిజన్ ఉచితంగా అందిస్తున్నామని, అవసరాన్ని బట్టి అవోప మంచిర్యాల ఇంకా 2 యంత్రాలు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అవోపా మంచిర్యాల వారు ప్రారంభించిన ఈ ఉచిత ఆక్సిజన్ సరఫరా సేవలు అవసరార్థులు ఉపయోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర అవోపా తెలియబరచుచూ, శ్రీనివాస్ గారిని, అవోపా మంచిర్యాల అధ్యక్ష కార్యవర్గాన్ని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి


కామెంట్‌లు