రవి కుమార్ కు స్టార్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారం


రాజపల్లి పాఠశాల ప్రదానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న వెనిశెట్టి రవికుమార్ ను 74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా ఉత్తరప్రదేశ్ బరేలికి చెందిన స్టార్ సంస్థ స్టార్ ఇండియా జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. అరుదైన ఈ పురస్కారానికి జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందించిన 41 మంది ఎంపిక కాగా తెలంగాణ రాష్ట్రము నుండి వీరికి చోటు లభించింది. సంస్థ ఫౌండర్ వీణా అగర్వాల్ ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా శనివారం సాయంత్రం అవార్డుని పంపించారు. లాక్ డౌన్ సమయములో విద్యారంగంలో పలు సేవలు చేయడం, వికలాంగ కుటుంబాలకు నిత్య అవసరాలను పంపిణీ చేయడం, వెనిశెట్టి జగదీశ్వరయ్య స్మారక సేవా సంస్థ ద్వారా ఉగాదీ పురస్కారాలు అందజేయడం, విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించేందుకు పాఠశాలలో తల్లిదండ్రులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించడం, మట్టి వినాయకులను పంపిణీ చేయడం, పలు జాతీయ సెమినార్లకు హాజరవడం, జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు పొందడం వంటి అంశాలను పరిగణన లొకి తీసుకొని ఈ అవార్డును అందిచడం జరిగిందని తెలియజేశారు. అవార్డ్ పొందడం పట్ల ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కాళ్ళ నారాయణ గారు, హుజురాబాద్ పట్టణ వైశ్య సంఘ అధ్యక్షలు గర్రెపల్లి శ్రీనివాస్ గారు, ఆవోపా మండల అధ్యక్షులు గౌరిశెట్టి రాజమొగిళి గారు, తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు నూకా యాదగిరి గారు అభినందనలు తెలిపారని తెలియజేశారు. ఇందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వీరికి అభినందనలు తెలియజేయు చున్నవి.


కామెంట్‌లు