నాగర్ కర్నూల్ అవోపా వారి ఆధ్వర్యంలో కవిసమ్మెలనము


ఈరోజు ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు నాగర్ కర్నూల్ జిల్లా లో జిల్లా అవోపా అధ్యక్షులు బిల్ల కంటి రవికుమార్, ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి ఇమ్మడి దేవేందర్, కందూరి బాలరాజు డాక్టర్ పోలా సాయి జ్యోతి ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమంనిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కవి సమ్మేళనం లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 165 మంది కవులు పాల్గొని ఆధునిక సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర అనే అంశంపై తమ కవితలను వినిపించడం జరిగింది. కవితలు వినిపించిన కవులందరికీ ఆన్లైన్లో ప్రశంసా పత్రాన్ని పంపడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా నిజం వెంకటేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నూక యాదగిరి గారు ఎడిటర్ అవోపా బులిటెన్ , మల్లిపెద్ది శంకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పోకల చందర్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పోలా శ్రీధర్, కలకొండ సూర్యనారాయణ, కొండూరు రాజయ్య , వాస పాండురంగయ్య , పోల నర్సింహయ్య గారు పాల్గొని తమ సందేశాన్ని ఇవ్వడం జరిగినది. కార్యక్రమంలో బొడ్డు పాండు, సోమిశెట్టి సురేందర్, రాధాకృష్ణ, సోమ శ్రీనివాసులు, వెంకటరమణ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


 


కామెంట్‌లు