పదవీ విరమణ శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా కాకతీయ రీజియన్ ఉపాధ్యక్షుడు, వరంగల్ జిల్లాలోని పరకాల అగ్నిమాపక విభాగంలో ఫైర్మ్యాన్ గా 33 సంవత్సరాలు పని చేసిన శ్రీ కమటాల భాస్కర్రావు గారు తేదీ 31.7.2020 రోజున పదవీ విరమణ చేయుచున్న సందర్భంలో ముఖ్య అతిథిగా జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీ ఎం.భగవాన్ రెడ్డి గారు హాజరై వారి సేవలను కొనియాడారు. వీరు ఇదివరలో ముఖ్యమంత్రి మరియు భారత దేశదేశాధ్యక్షుడి నుండి కూడా అవార్డులు పొందారని, ధైర్య సహాసాలతో ఎంతోమంది ఆస్తులను, ప్రాణాలను కాపాడారని అందరితో స్నేహపూర్వకంగా మెదిలే వారని తెలియజేసారు. అందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియ జేస్తూ, వీరి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడవాలని కోరుకొనుచున్నవి.


కామెంట్‌లు