విజయా బ్యాంక్ మేనేజర్ గా పనిచేయుచున్న శ్రీ మేడా ఉదయ శంకర్ గారి కూతురు అజీతా గాయత్రి వివాహము నరేంద్ర కుమార్ తో తేదీ 13.2.2020 చంపాపెట్ హైదరాబాద్ లో జరిగినది. వారి కూతురి వివాహ సంబంధం కుదుర్చుటలో విశేష కృషి సలిపిన శ్రీ.ఎం.ఎన్. రాజ్ కుమార్ గారికి అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారికి, రాష్ట్ర అవోపా మనేజ్మెంట్ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రూ.3,000లు అవోపా న్యూస్ బులెటిన్ కార్పస్ ఫండ్ కు జమచేయమని తెలంగాణ రాష్ట్ర అవోపా బ్యాంక్ ఖాతా లో జమ చేసినారు. కావున నూతన వధూవరులు కలకాలం సంతోషంగా, ఆనందోత్సాహాలతో సహజీవనం చేయాలని ఆశిస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ కార్పస్ ఫండ్ చెల్లించిన శ్రీ మేడా ఉదయ శంకర్కు, వారి కుటుంబానికి మరియు కార్పస్ ఫండ్ సేకరించి బ్యాంకులో జమచేసిన ఎం.ఎన్. రాజకుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కృతజ్ఞతలు తెలియజేయి చున్నవి.
This is header
• Avopa News Bulletin
This is footer
శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి