అవోపా కుటీర్ లో అన్నదాన కార్యక్రమము


అవోపా బ్యాంక్మాన్ చాపుటర్ వారు తేదీ 25.7.2020 రోజున బాలాపూర్ లోని వారు నిర్వహించే వృద్దాశ్రమంలో మనకు అత్యంత పర్వదినమైన శ్రావణ పంచమి గరుఢ పంచమి రోజున విశేష పూజలు జరిపి ఆశ్రితులకు మృష్టాన్న భోజన సదుపాయము కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతినెలా సంస్థకు ఆర్థిక తోడ్పాటందించే ఆంధ్రాబ్యాంక్ మ్యానేజర్ శ్రీ టి.ముకుంద రావు గారు స్పాన్సర్ చేయగా పలువురు సభ్యులు, ట్రస్టీలు హాజరైనారు. వారికి చాపుటర్ అవోపా కృతజ్ఞతలు తెలియజేశారు.


కామెంట్‌లు