అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారిచే పేద బ్రహ్మణులకు పూజారులకు నిత్యావసరాల పంపిణీ


అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు తేది 31 మే 2020 రోజున, కిరాణా సామాగ్రి బియ్యం, పప్పు, నూనె, చక్కెర,
గోధుమ పిండి,
సబ్బు, మాస్క్ మొదలైనవి కలిగిన 12 కిలోల ప్రతి ఒక్క కిట్ 65 పేద బ్రాహ్మణులకు మరియు
చిన్న ఆలయ పూజరీలకు
డాక్టర్ భాస్కరెడ్డి USA, అర్ధవిడు గ్రామం ప్రకాశం జిల్లా నివాసి గారి సహకారంతో పంపిణీ
చేశారు. ఆర్యవైశ్యుల ఆపధ్భాంధవుడు,
టిఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఐవిఎఫ్ అధ్యక్షుడు శ్రీ ఉప్పల
శ్రీనివాస్,'వామ్' గ్లోబల్ కోశాధికారి మిస్టర్ ఎల్వి కుమార్
ఈ కార్యక్రమానికి అభినందనలు తెలిపారు. టి ముకుందారావు,
జిఎన్ఎస్ ప్రసాద్ తదితరులు ఎప్పటిలాగే ఈ కార్యక్రమములో
పాల్గొన్నారు. బ్రాహ్మణులు,పూజారీలు వేదమంత్రాలతో
ఆశీర్వదించారు. USA లో వుంటూ ఈ కార్యక్రమానికి సహాయము చేసిన
డాక్టర్ భాస్కరెడ్డి వారి సతీమణి పద్మజారెడ్డి
మరియు వారి కుటుంబానికి అవోపా బ్యాంక్‌మెన్ చాపుటర్ వారు కృతజ్ఞతలు
తెలియజేసారు.

 


కామెంట్‌లు