కీ.శే. కల్నల్ సంతోశ్ కుటుంబ సభ్యులను పరమర్శించిన ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు


మన తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు  నేడు సాయంత్రం సూర్యాపేట లోని కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి సతీమణి సంతోషికి 4 కోట్లు, వారి తల్లిదండ్రులకు 1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, హైదరాబాద్ లో వారు ఉండడానికి 711 చ.గ.ల ఇంటి స్థలం, వారి సతీమణి కి గ్రూపు1 స్థాయి ఉద్యోగ నియామక పత్రం స్వయంగా అందజేశారు. సూర్యాపేట లోని ముఖ్యకూడలిలో కాంస్య విగ్రహాము ఏర్పాటు చేయుటతో పాటు కూడలి కి సంతోష్ బాబు పేరు పెట్టనున్నామని మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాకు వీర మరణం పొందిన సంతోష్ బాబు జిల్లాగా నామకరణం చేయాలని, ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఉప్పల శ్రీనివాస్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పసుమర్తి మల్లికార్జున్ తదితరులు అభిప్రాయపడుచూ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నారని సమాచారం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు