రాష్ట్ర అవోపాచే 2 లక్షలు మరియు హైదరాబాదు అవోపా చే 2 లక్షలు కోవిద్-19 సి.ఎం.రిలీఫ్ ఫండ్ కు విరాళాలు


తెలంగాణా రాష్ట్రములో ఎన్నడూ కనీ వినీ ఎరుగని కరోనా విలయ తాండవం మొదలయ్యాక, వాసవీ సేవా కేంద్రం వారు, తమ ఆవరణ లో గల సంస్థల అన్నింటి సహకారంతో, సుమారు 17 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, రోజుకు 4 వేల ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి, మన వంతుగా 1 లక్ష రూపాయలు ఇవ్వమన్నారు.


   తెలంగాణా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్  శ్రీ కోలేటి దామోదర్ గారు, 5 ఎకరాల స్థలం వైశ్య కార్పొరేషన్ కు ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, C.M. రిలీఫ్ ఫండ్ కు డబ్బు సాయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 


          ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని, తమ శక్తి మేరకు చేయూత నందించవలసిందిగా రాష్ట్ర కార్యవర్గాన్ని, రాష్ట్రం లోని అవోపా యూనిట్లను, సభ్యులను, మిత్రులను  1వ ఏప్రిల్ 2020 నాడు, మన గ్రూప్ లో మరియు అవోపా  బులెటిన్ లో మెసేజ్ పెట్టి    కోరడం జరిగింది.  మనకు వచ్చిన డబ్బులనుండి, కరోనా ఇబ్బందుల్లో కూడా, 23 వ ఏప్రిల్ 2020 నాడు, వాసవీ సేవా కేంద్రం వారికి 1 లక్ష రూపాయలు NEFT ద్వారా పంపడం జరిగింది. అలాగే 8 వ మే 2020 నాడు సీ. ఎం. రిలీఫ్ ఫండ్ కోసం  2 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను తీయడం జరిగింది. హైదరాబాద్ అవోప కార్యవర్గం కూడా, సీ, ఎం. రిలీఫ్ ఫండ్ కు  2 లక్షల చెక్ ను సమర్పించడానికి సమ్మతించారు. కాని కోలేటి దామోదర్ గారు ఎంత ప్రయత్నించినా, మంత్రి గారి బిజీ షెడ్యుల్ వల్ల, మనకు 9-6-2020 నాడు గాని, వారి అప్పాయింట్ మెంట్ దొరకలేదు. ఒక చెక్/ డ్రాఫ్ట్ తో ఒక్కరినే అనుమతించినందువల్ల, కోలేటి దామోదర్ గారి నేతృత్వంలో నేను, నమశ్శివాయ గారు మాత్రమే వెళ్లి 2 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్, 2 లక్షల రూపాయల చెక్  మంత్రి గారికి అందజేశాము. కోలేటి దామోదర్ గారు మా ఇద్దరినీ పరిచయం చేయగా, తెలంగాణా అవోపా గూర్చి, హైదరాబాద్ అవోపా గూర్చి, మన సేవా కార్యక్రమాల గూర్చి నేను వివరించాను.


          వారు మంచి చదువరి అని తెలిసిన నేను పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించిన " Satyagraha " ,C.K. Prahlad రాసిన " The fortune at the bottom of the pyramid ",Sirgapur Vidya Sagar Reddy గారి  " The Great Betrayal ", 
" The Maya Sabha ",  వాటికి నేను చేసిన తెలుగు అనువాదాలు " అతి పెద్ద నయవంచన " , " సిర్గాపూర్ నుండి వాల్ స్ట్రీట్ దాకా", "అర్థ శాస్త్ర సిద్ధాంతాలు ఓ మిథ్య " , మన తోట లక్ష్మణ రావు గారితో కలిసి రాసిన " పర్యావరణ పండుగలు " ," అలిశెట్టి ప్రభాకర్  కవి త్వం "  పుస్తకాలు అందజేయడం జరిగింది. శ్రీ కోలేటి దామోదర్ గారి ప్రయత్నం, సహకారం,స్ఫూర్తి , చేయూతతోనే ఈ కార్యక్రమం ఫలవంత మయింది. 


    ఈ ఆనంద సమయంలో, 3 లక్షల 39 వేల 828 రూపాయలు అందించి, నిధి సేకరణ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన 116 మంది దాతలకు, కృషి చేసిన నిధి సేకరణ కమిటీ కి, కార్యవర్గానికి, ఇ. సి. మెంబర్లకు, వివిధ కమిటీ ల చైర్మన్లు, వైస్ చైర్మన్ లకు, యూనిట్ మరియు జిల్లా అవోపాలకు, అవోపా బ్యాంకు మెన్ చాప్టర్ కు,  మరీ ముఖ్యంగా 25 వేల రూపాయలు పంపి, మన లక్ష్యం చేరడానికి సహకరించిన అవోపా, హైదరాబాద్ వారికి..... అందరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు! అభినందనలు !!


నిజాం వెంకటేశం ప్రధాన కార్యదర్శి
తెలంగాణా అవోపా.


కామెంట్‌లు