విద్యార్థులకు నిత్యావసరాల అందజేత


ఈ రోజు అవోపా హబ్సిగూడా సభ్యులు, ఔత్సాహికులు సీతాఫల్ మండిలోని మెడిబావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లోని 50 మంది విద్యార్థులకు పడుకునే చాపలు, కొబ్బరినూనె బాటిల్స్, సబ్బులు, అరటి పండ్లు, రాచారాయుడుచే రెండు సీలింగ్ ఫ్యాన్లు బహూకరించారు. ఈ కార్యక్రమాన్ని 12 మంది అవొప హబ్సిగూడా సభ్యులు తమ స్వంత నిధులతో ఏర్పాటు చేయగా హరిప్రసాద్, దివ్వెల శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, ఎం.రామలింగేశ్వర రావు, కె.వి.సత్యనారాయణ, రాజేంద్ర, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పలువురు వీరి దాతృత్వాన్ని ప్రశంసించారు.


కామెంట్‌లు