అవోపా కోదాడ వారి ఆహార పంపిణీ మరియు కూలీల తరలింపు


అవోపా కోదాడ వారు గత వారం రోజులుగా కోదాడ హై వేపై నడుచుకుంటూ వెలుతున్న వలస కూలీలకు చేస్తున్న సహకారం చూసిన వనమా పద్మనాభం లక్ష్మీ తులసి కారమడై  కోయంబతూరు, తమిళనాడు గారి పెండ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో 65 మంది హైవే పై నడుచుకుంటూ విజయవాడ నుండి మధ్యప్రదేశ్, వెళుతున్న వారికి ఈరోజు తేదీ 7.5.2020 రోజున ఆహారం పంపిణీ చేసాము. మరియు వీరిలో 31 మందిని కోదాడ ఎమ్మెల్యే శ్రీ బొల్లo మల్లయ్య యాదవ్ గారిని సంప్రదించి కిట్స్ కళాశాల యాజమాన్యం సత్యనారాయణ గారి బస్ లో కోదాడ నుండి వరంగల్ కు పంపటం జరిగినది అందులకు వారు కృతజ్ఞతలు తెలిపినారు. అవోపా  కోదాడ అధ్యక్షులు ఇరుకుళ్ళ చెన్నకేశవ రావు, ఉపాధ్యక్షులు కందిబండ వేంకటేశ్వర రావు, వంగవీటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, చల్లా వెంకటేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవోపా కోదాడ వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.



 


కామెంట్‌లు