అవోపాల వ్యవస్థాపకుడు శ్రీ కె.ఆర్. కృష్ణయ్య శెట్టి జయంతి శుభాకాంక్షలు.


ఈ రోజు మే 13 అవోపా వ్యవస్థాపకుడు శ్రీ.కె.ఆర్.కృష్ణయ్య శెట్టి గారి పుట్టినరోజు. అతను 13/5/1899 న హిందూపూర్ పలాసముద్రంలో జన్మించాడు. అతను ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా & మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో అవోపా సేవలను ప్రారంభించాడు, విస్తరించాడు మరియు సమాజంలోని చాలా మంది పేద వైశ్యులకు సహాయపడుటలో పాటుపడ్డాడు. మన తెలంగాణ రాష్ట్రంలో సమాజంలోని ఆర్యవైశ్య విజ్ఞానవంతుల, ప్రభుత్వ ఉద్యోగుల మొదలగు వారితో బీద ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో చేయూత నిచ్ఛుటకు మరియు వారికి సరైన మార్గదర్శనం చేయుటకు అవోపాలను ఏర్పాటు చేసి సమాజంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఖైరతాబాద్ లోని ఈ నాటి వాసవీ సేవా కేంద్రం ఆయన ఆలోచనల్లోంచి పురుడు పోసుకుని అవిర్భవించిందనుటలో అతిశయోక్తి లేదు. వారి సేవా తత్పరత, నిరడంబరత, లక్ష్య ఛేదన అనితర సాధ్యం. రాష్ట్రంలోని మారుమూల ఆర్య వైశ్యులకు సేవాలందించాలని, వారి ఔన్నత్యానికి పాటుపడాలని గ్రామ స్థాయి, తాలూకా స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయిలో యూనిట్ అవోపాలను రిజిస్ట్రీ చేపించి వారికి మార్గదర్శనం చేయుటకు అన్ని అవొపాలు ఒక్క త్రాటిపై నడచుటకు రాష్ట్ర అవొపా ఏర్పాటు మొదలగునవి బైలాలలో పొందు పరచి, రిజిస్త్రి చేపించి, పకడ్బందీగా అవోపా పతాక రచన చేసి ఈ రోజు రాష్ట్రమంతటా సేవా కార్యక్రమాలు అమలగునటుల దారి చూపిన ఆ మహనీయుడు శ్రీ కృష్ణయ్య శెట్టి గారి జయంతి ఈ రోజు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర అవోపాలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరం ఆయన భావాజాలాన్ని గౌరవిస్తామని అవోపాల అభివృద్ధికి కృషిచేస్తామని ప్రతిన బూనుదాం మరియు మన ఆవోపన్లమందరము ఆయన గౌరవార్థం ఆయన చూపిన బాటలో నడుస్తామని, తోటి ఆర్య వైశ్యునికి శాయ శక్తులా సహాయం చేస్తామని, వైశ్య జాతికి నిస్వార్థంగా, నిజాయితితో పని చేస్తామని, ఒక్క త్రాటిపై నడుస్తామని సంకల్పం తీసుకుందాం. ఆచరిద్దాం. జై వాసవి జైజై వాసవి


కామెంట్‌లు