This is header
జనగామ జిల్లా అవోపా వారిచే నిత్యావసర సరుకుల పంపిణీ


తేదీ 7.5.2020 రోజున జనగామ పట్టణంలో కరోనా మహమ్మారి బారి నుండి ప్రజలను రక్షించుటకు దేశ, రాష్ట్ర ప్రభుత్వం లు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో జనగామ పట్టణంలోని ఓల్డ్ ఆంధ్రాబ్యాంక్ వద్ద ఉన్న పేదలకు జిల్లా ఆవోపా జనగామ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి రూ.10,500 ల విలువైన కిరాణ సామాగ్రి, కూరగాయలు, మాస్కులు అమెరికాలోని భరత్ రెడ్డి సహకారంతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవోపా జనగామ జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి ప్రమాదకుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు గంగిశెట్టి మనోజ్ కుమార్, లయన్ క్లబ్ అధ్యక్షులు కృష్ణజీవన్ బజాజ్, తమ్మిశెట్టి మల్లికార్జున్, దారం నర్సయ్య, ముక్క ప్రకాశ్, తిప్పారపు శాంసన్ తదితరులు పాల్గొన్నారు.


This is footer
కామెంట్‌లు