అవోపా హబ్సిగుడా వారి కూరగాయ,మాస్కుల మరియుఆహార పొట్లాల పంపిణి

తేదీ 31.5.2020 రోజున అవోపా హబ్సిగుడా వారు మాచర్ల సోదరుల మరియు దివ్వెల శ్రీనివాస రావు గారల నేతృత్వంలో  450 కిలోల కూరగాయలు సుమారు 170 మందికి శ్రీ కె. రమణ కిషోర్ గారు దాతృత్వంతో జిహెచ్‌ఎంసి యోధులకు మరియు హెచ్‌ఎమ్‌టి నగర్‌లో నివసిస్తున్నపేద ప్రజలకు పంపిణీ చేశారు. తార్నాక లోని వెల్ఫేర్ అసోసియేషన్ లో కరోన బారి నుండి రక్షింప బడడానికి మాస్కులు, సానిటాయిజర్స్ అవోపా హబ్సిగూడా పితామహుడు శ్రీ చిన్నయ్య గారి చేతుల మీదుగా సుమారు 50 మంది పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు. తదుపరి నాచారం లోని మహంకాళి దేవాలయం వద్ద అవోపా హబ్సిగూడా యొక్క 13 మంది సభ్యుల ఆర్థిక సహాయముతో  సుమారు 300 అన్నార్తులకు ఆహార పోట్లాలు అవోపా అధ్యక్షుడు శ్రీ జె. శివకుమార్ ద్వారా పంపిణీ చేశారు.  అవోపా హబ్సిగూడా వారి సేవా కార్యక్రమాలను శ్రీ చిన్నయ్యగారు, హనుమంతరావు గారు, ఎన్.ఎస్ కృష్ణమూర్తి గారు, పబ్బా సతీష్ గారు, అల్లాడి జ్ఞానేశ్వర్ గుప్తాగారు, శివకుమార్ గారు, హరిప్రసాద్ గారు, భవాని గారు, ఎం.శ్రీనివాసరావు గారు, రామలింగేశ్వర రావు, హితేంద్రనాథ్ గారు, కర్నాటి సోమయ్య గారు, చంద్రమోహన్ గారు, కె.సూర్యారావు గారు, ప్రేమ్ కుమార్ గారు, మోహన్ గుప్త గారు, రామమోహన్ గారు తదితరులు అభినందించారు. ఇలాంటి మంచి ప్రజాహిత కార్యక్రమాలు చేయుచున్న అవోపా హబ్సిగూడా వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష  కార్య వర్గము, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందిస్తున్నవి.  శ్రి చిన్నయ్య గారిచే మాస్కుల పంపిణి 


కామెంట్‌లు