అవోపా హనుమకొండ వారి 40వ రోజు అహార పంపిణి


అవోపా హనుమకొండ వారు రోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమము నేటికి 40వ రోజు పూర్తయినది. ఈ నలభై రోజులు సుమారుగా 200 మందికి పైగా రోజు వారీ కూలీలకు, పారిశుధ్య కార్మికులకు, యాచకులకు, చిల్లర వ్యాపారులకు రోజుకొక వెరైటీ చొప్పున అల్పాహారం అందించారు.  వీరి కార్యక్రమానికి ముగ్దులై దాతలు ముందుకోచ్చి ఆహార పంపిణీకి ఆర్థిక సహాయం చేసి సంస్థ పేరును, గౌరవమును ద్విగుణీకృతం చేశారు. ఈ లక్డౌన్ సమయంలో వీరు బీదలకు చేసిన సహాయము మరువలేనిది, హర్షణీయమైనది. ఈ రోజు దాతలు సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఎం.రామానుజం - పద్మ దంపతుల పెళ్లిరోజు కావున, శ్రీ తాటిపెళ్లి శ్రీనివాస్-లక్ష్మీ మరియు కూతుర్లు వాణి మరియు సిరీల కుటుంబం, కంభంపాటి శ్రవణ్ కుమార్-సరిత దంపతులు వారి మేనత్త శారద కేదారిల జ్ఞాపకార్థం అన్నదానం సుమారు 240 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో అధ్యక్షుడు, కార్యదర్శి మరియు కోశాధికారి, ఫౌండర్ పోకల చందర్, కె. రమణయ్య, దేవా మధుబాబు, అళ్ళెంకి చంద్రశేఖర్, ఐతా భాస్కర్ రావు, చిదరా రాజశేఖర్, అకినెపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారని అధ్యక్షుడు తెలియజేయగా అవోపా హనుమకొండ వ్యవస్థాపక కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు వీరి కార్యక్రమాన్ని అభినందిస్తూ నేటికి 40 రోజులు క్రమం తప్పకుండా సుమారు 10,000 ల మందికి పైగా అన్నార్తులకు ఆహారం అందించారని, అందుకు సుమారు రూ. 2,00,000 వెచ్చించారనీ, దాతల సహకారంతో ఇది సాధ్యమైనదనీ ఇందులకు అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్, కార్యదర్శి ప్రకాశం మరియు కోశాధికారి సేవలు మరువలేనివని తెలిపినారు. కావున తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ దాతల కుటుంబాలపై, సంస్థ కార్యకర్తలపై, సహకరించిన సభ్యులపై వాసవీ మాత కరుణా కటాక్షాలు ప్రసరించాలని ఆయురారోగ్యాలతో విలసిల్లాలనీ అభిలషిస్తున్నవి.  https://youtu.be/-lHWFSlcFwsకామెంట్‌లు