4వ అంతర్జాల వధూవరుల పరిచయ వేదిక


అవోపా హైదరాబాద్ వారు 4వ వివాహ పరిచయ వేదికను జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 16.5.2020 (శనివారం) రోజున  నిర్వహించారు. ఈ అంతర్జాల దృశ్య మాధ్యమ పెళ్లి సంబంధాల పరిచయ వేదికలో వధువులు 49 మంది వరులు 50 మంది మొత్తం 99 మంది హాజరయ్యారు. అందరూ వారి వారి ఇండ్లలో నుండి మరియు విదేశాల నుండి  వారి తల్లిదండ్రులతో పాల్గొన్నారు. ఉదాహరణకు వరుడు అమెరికా నుండి తన గురించి వివరణ ఇస్తే, అతని తల్లిదండ్రులు దుబాయ్ నుండి వారి కోడలికి ఉండవలసిన లక్షణాలు వివరించారు. ఇలాంటి వివరణలు, అభిలాశలు పలువురిని ముఛ్చట గొలిపాయి, మరియు దినదినాభి వృద్ధి చెందుతున్న సాంకేతికతను బాగా ఉపయోగించుకుని ఏర్పాటు చేసిన డిజిటల్ పరిచయ వేదిక అచ్ఛేరువొందెలా చేసింది. వాసవీ మాత పూజ  అనంతరము  ప్రార్థనా గీతాలు మైసూర్ నుండి శ్రీమతి రష్మీ ఆదీశ్  శ్రవనానందంగా అలపించగా వాసవీ మాత విశిష్టత గురించి చక్కగా వివరించి శ్రోతల సందేహాలను శ్రీ సుబ్రమణ్యం గుప్త, వక్త, రచయిత ఆంద్రప్రదేశ్ గారు తీర్చారు. సమావేశ ప్రారంభంలో మరియు తరచూ సంధి సమయాల్లో అధ్యక్షుడు నమఃశివాయ గారు వివాహ పరిచయ వేదిక గురించి అధ్యక్షోపన్యాస మిచ్చారు. సమావేశ ఆధ్యంతము వ్యాఖ్యాతలుగా సంపత్ గారు, సాంబశివ రావు గారు, భద్రినాథ్ గారు కడు ఆసక్తిగా నిర్వహించారు. కోవిడ్ 19 సమయంలో అవోపా హైదరాబాద్ నిర్వహించిన ఉత్తమ వేదిక అని ఈ సందర్బంగా టి.జి .వెంకటేష్, కొలేటి దామోదర్, బొల్లం సంపత్ కుమర్ ,అంభికా క్రిష్ణా , ఉప్పల శ్రీనివాస్, అమరవాధి లక్ష్మిణారాయణ ,  వేళూరి రవీంద్రనాథ్ గుప్తా, జి.యోగానంద్ , గందె సుధాకర్ , గంజి స్వరాజ్యబాబు, పోకల చందర్, సిఎ.బి. చక్రపాణి , చిదర ఓంకారేశ్వర్, దిడిగె జయంత్  గారు తెలియ చేసారు. ఇలా అందరిని ఒక వేదికపై కలపడం అమ్మాయి, అబ్బాయి లను పరిచయం చేయడం చాల మంచి పరిణామం అని తెలియ జేస్తూ కార్యక్రమం గురించి విజయవంతమైన విధి విధానాల గురించి తీసుకున్న శ్రధ్దల గురించి అవోపా అధ్యక్షుడిని, వారి కమిటిని ముఖ్యంగా వివాహ పరిచయ వేదిక ప్రాజెక్ట్ చైర్మన్, ప్రాజెక్ట్ కమిటీ సభ్యులను  ప్రశంసించారు. ఈ కార్యక్రమానంతరము అధ్యక్షుడు నమఃశివాయ మాట్లాడుచూ ఇంత పెద్ద కార్యాన్ని సభ్యుల సహాకారంతో  పూర్తి చేశానని, ఇందులకు తన వివివి4 ప్రాజెక్ట్ చైర్మన్, రాజేశ్వర రావు, కమిటీ సభ్యులతో బాటు, సాంకేతికంగా చంద్రమోహన్ గారు మరియు గంపా నాగేశ్వరరావు గారలు జూమ్ నిర్వహణలో తమ వంతు సహాయ సహాకారాలు అందించారనీ, వ్యాఖ్యాతలుగా సాంబశివరావు గారు, సంపత్ గారు సమయోచిత వ్యాఖ్యానంతో వధూ వరులను పరిచయం చేశారని ముఖ్యంగా వివివి4 కమిటీ సభ్యులు శ్రమకోర్చి వధువు వారులను  చేర్పించి నందున సాధ్య పడిందని సెలవిస్తూ ఈ కార్యక్రమ విజయవంత మగుటలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ జేస్తూ మిగులు నిధిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిద్-19 సహాయ నిధికి బదిలి చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. చివరగా ప్రధాన కార్యదర్శి రవీగుప్త గారు వందన సమర్పణ చేశారు. 


 


 


 


కామెంట్‌లు