అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారిచే 4 అనాథాశ్రమాలకు నిత్యావసరాల పంపిణీ


అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు  మే 24న హైదరాబాద్ లోని వికలాంగుల కళా వేదిక, అమ్మ ఫౌండేషన్, ఆనంద్ మార్గ్ మరియు స్పందన పరమేశ్వర్ అను నాలుగు అనాథాశ్రమాలు ఒక్కొక్కటికి 2 బియ్యం మరియు ఒక పప్పు సంచులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కెవిఎస్ గుప్తా, టి మధుసూదన్ రావు, టి ముకుందారావు, జిఎన్ఎస్ ప్రసాద్, శివకృష్ణ, గురుమూర్తి పాల్గొన్నారు. వి3 న్యూస్ ఛానల్ వారు ఉచితంగా ప్రోగ్రామ్ ను కవర్ చేశారు.  ఇంతకు ముందు 17.5.2020 రోజున హనుమాన్ జయంతి సందర్భముగా 85 మంది అన్నార్తులకు ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున కూరగాయలు హనుమాన్ నగర్ చైతన్యపురి లోని విజేత విహార్ అపార్టుమెంట్ వద్ద భవ్య ఇన్ఫ్రా కె.రమనకిశోర్ గారి సహాయముతో  పంపిణీ చేశారు. టి.ముకుందరావు, జి.ఎం.ఎస్ ప్రసాద్ కె.వి.ఎస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు