This is header
ఉప్పలచే ప్రతినిత్యం ఆహారం, సరుకుల పంపిణీ


తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహా దారు, టీ.ఆర్ఎస్  స్టేట్ లీడర్, ఐవీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తగారు లాక్ డౌన్ నేపధ్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు 46వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని కొత్తపేట్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, బండ్లగూడ, సైదాబాద్, సహారా కాలనీ, మలక్ పేట్, మనుసురాబాద్, నాగోల్ లో  2వేలమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కార్మికులకు, నిరుపేదలకు, ఆటో డ్రైవర్లకు బిర్యానీ ప్యాకెట్లు, మాస్కుల పంపిణీ నిర్వహించారు. అలాగే వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్ కు, నాగోల్ లోని వాత్సల్యం ఆర్గనైజేషన్ కు, మనుసురాబాద్ లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు భోజనాలు, మాస్కులు 44 రోజులుగా అందిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఐవీఎఫ్ తరపున, జీహెచ్ఎంసీ పరిధిలో ఉప్పల ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలువురు జర్నలిస్టులు, వైద్య సిబ్బందికి కరోనా మాస్కు, గ్లోవ్స్, శానిటైజర్ గల కోవిడ్  సేఫ్టీ కిట్లు అందించారు. ఈ కార్యక్రమాల్లో ఐవీఎఫ్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారు. వీరి చేసే నిరంతర సేవలకు పలువురు అభినందిస్తున్నారు, అన్నార్తులు 'అన్నదాత సుఖీభవ' అని దీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా కూడా వీరి సేవలను కొనియాడుచూ అభినందనలు తెలియజేయుచున్నవి.


This is footer
కామెంట్‌లు