గవర్నర్ చే కూలీలకు బీదలకు ఆహార పొట్లాల పంపిణీ


తేదీ 12.4.2020 రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు, V3 ఛానల్ కాచం ఫౌండేషన్తో కలిసి సంయుక్తంగా ప్రతీ రోజూ రెడ్ క్రాస్ సొసైటీకి బీదలకు పంచుటకు ఇచ్చుచున్న విదంగా ఈ రోజు కూడా ఇఛ్చిన ఆహార పొట్లాలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిచే రాజభవన్లో పరిశుద్ధ కార్మికులు, బీదలు, నిత్య కూలీలు మరియు రాజభవన్ పరిసర ప్రాంతంలో నివసించే సుమారు 300 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్షుడు శ్రీ.పి.వి.రమణయ్య గారు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమా రెడ్డి గారు, V3 ఛానెల్ అధినేత కాచం సత్యనారాయణ గారి సతీమణి మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ ప్రధాన కార్యదర్శి కాచం సుష్మ గారలతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు వీరి కార్యక్రమమును ప్రశంసిస్తున్నారు.  
కామెంట్‌లు