పుదీనా రైస్ పంపిణీ చేసిన అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారుఈ రోజు 14 ఏప్రిల్ న 9 వ మరియు చివరి రోజు అన్నదాన కార్యక్రమము బి.ఎన్. రెడ్డి నగర్ బి.సి.కాలనీ లోని గాయాత్రినగర్లో నిర్వహించడం జరిగినది. ఇందులో సుమారు 290 మంది బీదలకు, రోజువారి కూలీలకు, చిరు వ్యాపారస్తులకు మరియు అన్నార్థులకు రుచికరమైన పుదీనా అన్నము పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘం వ్యవస్థాపకుడు శ్రీ భావనా శ్రీనివాస్ మరియు సంతోషిమత ఆలయం చైర్మన్ శ్రీ బాలాజీ నాయుడు, కాలనీకి చెందిన లక్ష్మయ్య, వీరచారి, సతీష్, దయానంద్, అవోపా సభ్యులు జిఎన్ఎస్ ప్రసాద్ ఇండియన్ బ్యాంక్, టి ముకుంద రావు ఆంధ్ర బ్యాంక్,  రవీంద్రనాథ్ టాగోర్, విబిజికి చెందిన రాఘవేంద్ర మరియు ట్రిసిటీ వాసవి క్లబ్, జె వెంకట చలం, ఆర్‌ఎం సిటిజెన్ కో అపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారలు జై భారత్ జై హింద్ అను నినాదానాలతో ఈ పంపిణీలో పాల్గొన్నారు. 


 


కామెంట్‌లు