అవోపా హనుమకొండ వారిచే ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్  సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్  రావు గారిచే ప్రారంభించబడి నేటికి 13 వ రోజు. నర‌్సంపేట వాస‌్థవ‌్యులు,  భూపతి రమేశ్ - ఉమాదేవి ల ఏకైక పుత్రుడు భూపతి కార్తీక్ (SWE HYDERABAD) జన‌్మదినం సందర్భంగా  ఈ కార‌్య క్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక్రమంలో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, మద‌్ది బిక‌్షపతి, కల‌్లూరి శ్రీనివాస్, మాదారపు వేణుగోపాల్, దేవా మధుబాబు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 230  మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన శ్రీ భూపతి రమేష్ - ఉమాదేవి ల కుటుంబానికి ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో, మరింతగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని యెల‌్లెంకి రవీందర్ అద‌్యక‌్షుడు అవోపా హన‌్మకొండ కోరుకును చున్నారు.


కామెంట్‌లు