మహబూబ్నగర్ జిల్లా అవొపకు ఎన్నికలు


ఇటీవల అవోపా భవన్, మహబూబ్ నగర్ లో జరిగిన మహబూబ్ నగర్ అవోపా ఎన్నికలలో మహబూబ్నగర్ జిల్లా అవోపా అధ్యక్షులుగా కంది శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున  రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు మాలిపెద్ది శంకర్, కార్యదర్శి కొండూరు రాజయ్య, మహబూబ్నగర్ టౌన్ అధ్యక్షుడు బి.టి.ప్రకాశ్, మురళీధర్ రావు తదితరులు హాజరై  నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు కంది శ్రీనివాస్ గారిని అభినందించారు. ఇందులకు తెలంగాణ అవొపా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి అవోపా రాష్ట్ర కార్యవర్గం మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము కూడా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు కంది శ్రీనివాస్ గారిని  మనస్ఫూర్తిగా అభినందిస్తున్నవి. వారి నాయకత్వంలో జిల్లాలోని అన్ని మండలాలలో అవోపా యూనిట్లు ఏర్పడాలని, సమాజానికి మరింత సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు, ప్రధాన కార్యదర్శి, నిజాం వెంకటేశం, కోశాధికారి చింతా బాలయ్య, రాష్ట్ర కార్యవర్గం మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.


కామెంట్‌లు