అవోపా హనుమకొండ వారిచే అల్పాహార పంపిణీఅవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో హోటల్ గ్రాండ్ కాకతీయ వద్ద ఈ రోజు నుండి లాక‌్డౌన్ ఎత‌్తివేసేంత వరకు ప్రతిరోజూ ఉదయం నిరంతరం విధులు నిర్వహిస్తున్న  పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, బీద వీధి వ్యాపారులకు మరియు ఇతరులకు సుమారు వంద మందికి  అల్పాహారం పంపిణీ చేయు కార్యక్రమం చేపట్ట బడింది. ఈ కార్యక్రమంలో లబ్ది దారులు సామాజిక దూరం మరియు మాస్క్ ల దారణ పాటిస‌్తూ, ప‌్రభుత‌్వ సూచనలు ఆచరించడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమమునకు వరంగల్ మహానగర మేయర్ శ్రీ గుండా ప‌్రకాశ్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరు కాగా  రాష్ట్ర అవోపా ముఖ‌్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు, అవొపా హన‌్మకొండ అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కోశాధికారి మరియు నేటి కార‌్యక్రమ అల్పాహార దాత యం.వి. అప‌్పారావు, రాష్ట్ర అవోపా ఉపాద‌్యక్షుడు మడుగూరు నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కే.రమణయ‌్య , రామానుజం, శ్రీమతి వేణిగంటి నిర‌్మల, జి.కోటిలింగం, మద‌్ది బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో దాదాపు గా వంద మంది పారిశుధ్య కార్మికులకు, రోడ‌్డు పై నడిచే పాదచారులకు అల్పాహారం పంపిణీ చేశారు. 


కామెంట్‌లు