టౌన్ అవోపా మహబూబ్నగర్ వారిచే ORS ప్యాకెట్ల పంపిణీ


తేదీ 17.4 2020 రోజున  పాలమూరులో టౌన్ అవోపా వారు అవోపా పట్టణ అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ బాబు నేతృత్వంలో కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో కరోనా వ్యాధి అందరికి సోకకుండా రోడ్లమీద మన కోసం రాత్రనక పగలనక రేయింబవళ్లు కష్టపడుతూ కుటుంబాలకు దూరమై ఎండలో డ్యూటీ చేస్తున్న మన పోలీసు వారికి డీహైడ్రేషన్ కాకుండా, శక్తి, ఉత్సాహం రావడానికి సుమారు 100 మంది పోలీసు వారికి 10000 వేల రూపాయల విలువగల ORS డ్రింక్స్ పంచడమైనది.ఇట్టి కార్యక్రమంలో టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ బాబు, ట్రెజరర్ జ్వాలా నరసింహ, మరియు అవోపా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కరోనా వైరస్ త్వరగా అంతరించి పోవాలని, ప్రజలందరూ మాస్కులు ధరించి, శానిటైసర్లను ఉపయోగిస్తూ, భౌతికంగా దూరం పాటిస్తూ, కరోనా రాకుండా జాగ్రత్త పడాలని కోరారు. 


 


కామెంట్‌లు