తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా హైదరాబాద్ సలహాదారు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు, తెలంగాణ నాయకులు భండారు సుబ్బా రావు వారి కుమారులు భండారు నాగరాజు ఈ రోజు ముఖ్యమంత్రి KCR గారిని కలిసి రూ 25 లక్షలు కరోనా గురించి ముఖ్యముగా మాస్కులకు, టెస్ట్ కిట్లకు గాను విరాళం ఇచ్చారు.
లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 300మంది వలస కూలీలకు అవోపా హైదరాబాద్ ప్రత్యేక సలహాదారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఉప్పల ఫౌండేషన్ తరపున నిత్యావసరాలు అందజేశారు. ప్రభుత్వ సహకారంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు నాగోల్ లోని తన నివాసంలో ఈ కార్యక్రమం చేపట్టారు. బియ్యం, కందిపప్పు, సాల్ట్, కారం, మంచినూనె, దనియాల పౌడర్, పసుపు అందజేసారు. అలాగే మాదాపూర్ లోని ఐ స్టే హోటల్ నుండి గత 14 రోజులుగా లాక్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, వైద్యులు, వలస కూలీలకు ఉప్పల ఫౌండేషన్ తరపున ఆహారాన్ని అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారిని కలిసి కరోనా నివారణ ఫండ్ కు వ్యక్తిగత విరాళంగా రూ. 10.00 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.
కావున వారి దాతృత్వానికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయు చున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి