మహబూబ్నగర్ టౌన్ అవోపా వారి అల్పాహార పంపిణీ


తేదీ 19.4.2020 రోజున మహబూబ్నగర్ టౌన్ అవోపా వారు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తోన్న బీద ప్రజలకు, మరియు పల్లెటూర్ల నుండి సిటీకి వచ్చిన కూలీలకు, బీదవారికి సుమారు 500 మందికి  స్థానిక క్లాక్ టవర్, అబ్దుల్ ఖాదర్ దర్గా దగ్గర అల్పాహారం అందించారు. స్వీకరించిన ప్రజలు టౌన్ అవోపా సేవలను మెచ్చుకుంటూ ఆనందంగా తీసు కున్నారు. ఇట్టి కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసిన అవోపా ఫైనాన్స్ సెక్రెటరీ జ్వాలా సింహ గారికి   జనరల్ సెక్రెటరీ కొక్కళ్ళ చంద్రశేఖర్ గారికి, P. R. O. ch కిషోర్గారికి , కొక్కళ్ళ కిషోర్ గారికి, పబ్బతి మురళి గారికి, సంసాంగ్ శ్రీధర్ గారికి, పురం రాజేందర్ గారికి, పూరి శివకుమార్ గారికి, పెండ్యాల యాదయ్య గారికి, తల్లం నాగరాజు గారికి, పెండ్యాల ప్రసాద్ గారికి, మిరియాల శేఖర్ గారికి,  ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికి శతకోటి వందనాలు తెలియజేస్తూ వచ్చిన వారందరికీ అధ్యక్షుడు బి.టి ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు.కామెంట్‌లు