అవోపా హనుమకొండ వారి ఉపాహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో అల‌్పాహర పంపిణీ కార్యక్రమం 5వ రోజు,  సందర్భంగా, అడ‌్వకేట్ శ్రీ  తాటిపెల‌్లి లింగమూర్తి - సుజాత దంపతుల సహకారం తో ఈ రోజు కార‌్యక్రమం నిర‌్వహించడం జరిగింది. ఈరోజు కార‌్యక్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, కోశాధికారి యం.వీ అప‌్పారావు, శ్రీమతి నూక విద‌్య  దంపతులు, దేవా మధుబాబు, కల‌్లూరి శ్రీనివాసు, భగవంతయ‌్య, తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కార‌్యక్రమమునకు సహకరించిన శ్రీ తాటిపెల‌్లి లింగమూర్తి-సుజాత దంపతులకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో    పాటు మరింతగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా వారు కోరుకుంటున్నట్టు అధ్యక్షుడు తెలియజేసారు.


కామెంట్‌లు