అభినందనలు


ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మంచిర్యాల జిల్లా ఆవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ తో టెలిఫోన్లో సంప్రదించి మంచిర్యాల జిల్లాలో చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు, కోవిద్-19 బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, బీదలను, వలస కూలీలను ఆదుకుంటున్న సందర్భాల గురించి వాకబు చేస్తూ కోవిద్-19 గురించి ముఖ్యమంత్రి సహాయ నిధికి చందాలు పంపుటకు తమ వంతు సహాయమందించ వలసినదిగా కోరగా, గుండా సత్యనారాయణ గారు తమ జిల్లాలో వారు చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి వివరిస్తూ ఆవోపా మంచిరియాల జిల్లా, ఆవోపా మంచిరియాల్ యూనిట్, లక్సట్టిపేట్ యూనిట్, చెన్నూర్ యూనిట్, బెల్లంపెల్లి యూనిట్, కరోనా లాక్ డౌన్ సమయములో నిరుపేదలకు, వలస కార్మికులకు, అన్నార్థులకు ఆహారము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని ఆ వార్తలను ఎప్పటికప్పుడు బులెటిన్ కు పంపిస్తున్నామని, బులెటిన్ లో కూడా ప్రతి రోజూ వార్తలు ప్రచురించుచున్నారని, జిల్లా నుండి రాష్ట్ర అవోపా కు కరోనా ఫండ్ కూడా పంపించామని, ఇంకనూ పంపడానికి ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ కరోనా లాక్ డౌన్ పొడిగిస్తే తమసేవలు ఇలాగే కొనసాగిస్తామని గుండ సత్యనారాయణ తెలిపినారు. ఈ టెలిఫోన్ సంభాషణలో పట్టణ అధ్యక్షుడు, ఆవోపా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుదర్శన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రభ దిన వార్తా పత్రికలో కూడా "అపూర్వం - దాతల దయాగుణం" శీర్షికన అవోపా మంచిర్యాల చేపట్టిన కార్యక్రమాల గురించి, నిత్యాన్నదాన పంపిణీ గురించి పోలీసులకు బ్లడ్ బ్యాంక్ వారలకు సరఫరా చేసిన ఫేస్ మాస్కుల గురించి చాలా చక్కగా వివరించారు. అందులకు మరియు మంచి ప్రాయోజిత కార్యక్రమాలు చేయుచున్న మంచిరియాల అవోపా జిల్లా కమిటీకి, జిల్లా లోని అన్ని యూనిట్ అవోపాలకు రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ఎడిటర్ నూకా యాదగిరి మరియు రాష్ట్ర అవోపా కమిటీ ప్రత్యేక అబినందనలు తెలుపు చున్నారు. 


 


కామెంట్‌లు