మంచిర్యాల జిల్లా మరియు పట్టణ అవోపాలచే పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ


జిల్లా ఆవోపా మరియు పట్టణ ఆవోపా ఆధ్వర్యములో లక్సట్టిపేట్ మున్సిపాలిటీ లో పనిచేసే 50 మంది  పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా 5 కిలోల బియ్యము, పప్పు, కూరగాయలు, సబ్బులు, పండ్లు పంపిణి చేశారు. ఈసందర్భంగా జిల్లా అవోపా అధ్యక్షుడు గుండా సత్యనారాయణ ప్రసంగిస్తూ కరోనా వ్యాధి ప్రభలుచున్న సందర్బముగా మన వీధులను పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరము మనకు సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనియని వారికీ ఎంతో కొంత సహాయము చేయాలనే ఉద్దేశ్యంతో వారిని పూల మాలతో సత్కరించి నిత్యావసర కిట్స్ అందించామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య గారు మాట్లాడుచూ అవోపా జిల్లా పట్టణ  కమిటీలు ఇలాంటి సేవలు చేయడము అబినంద నీయ మన్నారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడు,  పట్టణ ఆవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, కొత్తవెంకటేశ్వర్లు, గుండ ప్రభాకర్, వొజ్జెల రాజమౌళి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెట్ల రమేష్, పాలకుర్తి వెంకటేశ్వర్లు, కొంజర్ల శ్రీనివాస్, కటుకూరి కిషన్, గుండా సంతోష్, ఉతురి జయము, రాగుల రాజమౌళి, వొజ్జెల కృపాకర్,  మున్సిపల్ కమిషనర్ త్రియంబక్ రావు, మానేజర్ మల్లారెడ్డి, కౌన్సిలర్ మెట్టు రాజు మరియు 50 మంది పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారని, పారిశుధ్య కార్మికులను ఆదుకోవడం అభినందనీయమని కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన శాసన సభ్యుడు దివాకర్ రావు గారు అన్నారని గుండా సత్యనారాయణ గారు తెలియ జేసారు.


https://youtu.be/CT3oK7g0Y7c


 


 


కామెంట్‌లు