ఉప్పల ఫౌండేషన్ చే ఆటో డ్రైవర్స్ కు నిత్యావసర సరుకుల పంపిణీ


తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారు, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఒక మంచి మత సామరస్య కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్ డౌన్ తో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న ముస్లిం ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చేయూత నివ్వాలన్న ఉద్ద్యేశ్యముతో టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తగారు సదరు ముస్లిం కుటంబాలకు నిత్యావసరాలు అందజేసి జాతి సమైక్యతను చాటి చెప్పారు. బియ్యం, మంచినూనె, ఉప్పు, కారం, పసుపు, కందిపప్పు అందించారు. హమారా శ్రీనివాస్ భాయ్ సుఖీ రహే అంటూ ముస్లిం మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు. 


కామెంట్‌లు