పి.ఎం ఫండ్ కు విరాళం


తెలంగాణ రాష్ట్ర ఎంప్లొయ్మెంట్ సెల్ కమిటీ చైర్మన్ శ్రీ ఉప్పల రామేశం గారి కూతురు శ్రీమతి డాక్టర్ నగరత్న. ఆమె భర్త డాక్టర్ శ్రీనివాస్ అవోపా జగిత్యాల సభ్యులు మరియు 2012లో పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా నొసంగిన, అప్పటి తమిళనాడు గవర్నరుగా ఉన్న శ్రీ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా KSF అవార్డ్ను పొందియున్నారు. వీరు జగిత్యాలలో భారతీ హాస్పిటలను నిర్వహించుచూ రోగులకు సేవచేయుచూ లక్డౌన్ సందర్భంగా పనిలేక ఆకలితో అలమటించుచున్న వలస కూలీలకు మొన్న అన్నదానం చేసి కరోన వైరస్ వ్యాప్తి నివారణకు ఏర్పాటు చేసిన పి.ఎం కేర్స్ కోవిద్-19 ఫండ్ కు రు.35,000లు విరాళం ఆన్లైన్ ద్వారా పంపించి వారి ఉదారతను చాటుకున్నారు, వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ మరియు అవోపా జగిత్యాల అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు