టి.ఏ.వి.వి.వి ఆవిర్భావం


తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఆవిర్భావ వేడుకలను తేదీ 8.3.2020 రోజున ఆర్యవైశ్య హాస్టల్, ముషీరాబాద్లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సర్వాశ్రీ గంజి రాజమౌళి గుప్త, కోలేటి దామోదర్, గణేష్ గుప్త, ఉప్పల శ్రీనివాస్, బండారు సుబ్బారావు, తెలంగాణ రాష్ట్ర అవోప అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, నిజాం వెంకటేశం, పోకల చందర్, గుండా చంద్రమౌళి, చింత బలయ్య, కూర చిదంబరం, సుబ్బారావు, నూకా యాదగిరి, కాచం సత్యనారాయణ గుప్త, వెంకటేశ్వర్లు, వివిధ పత్రికల విలేఖరులు, సంపాదకులు, ప్రకాశకులు అధిక సంఖ్యలో హాజరై నూతనంగా ఆవిర్భవించిన విద్యావంతుల వేదిక అధ్యక్షుడుగా ఎన్నికైన శ్రీ బల్లు చంద్రప్రకాశ్ గారిని అందరూ అభినందించారు. సంస్థ కూడా హాజరైన విజ్ఞాన వంతులను, ముఖ్యులను, నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. 


కామెంట్‌లు