లక్సెట్టిపెట్ లో జిల్లా మరియు పట్టణ విద్యార్థులకు క్విజ్ పోటీలు


తేదీ 20.2.2020 రోజున తెలుగు మాతృ బాషా దినోత్సవం సందర్బంగా స్థానిక గిరిజన బాలుర  పాఠశాల లక్సట్టిపేట్ లో జిల్లా మరియు పట్టణ అవోపా ఆధ్వర్యములో  7వ, 8వ, 9వ తరగతి చదువుచున్న విద్యార్థులకు మహాభరత్, రామాయణం లో క్విజ్ పోటీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానము జిల్లా, పట్టణ అవోపా ఆధ్వర్యములో జరిగినది. ఈ ప్రోగ్రాములో జిల్లా ప్రెసిడెంట్  గుండా సత్యనారాయణ ప్రసంగిస్తూ విద్యార్థుల మెధాశక్తిని వెలికి తీయుటకు మరియు నైతిక విలువలను పెంపొందించేందుకు క్విజ్ లు నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు భవిష్యత్తులో ఇవి ఎంత గానో ఉపయోగ పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవోపాజిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ, పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, ప్ర్రదాన కార్యదర్శి అక్కనపెల్లి రవీందర్, అవోపా ఉపాధ్యక్షుడు అల్లంకి సత్తయ్య, కార్యదర్శి నరెందుల రమేష్, పాఠశాల టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు