అవోపా హనుమకొండ వారిచే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల తెలుగు నిఘంటువుల పంపిణీ


తేదీ 24.2.2020 రోజున అవోపా హనుమకొండ వారు వరంగల్లు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఒక ప్రాయోజిత కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో 6 నుండి 8 వ తరగతి చదువుచున్న 150 మంది విద్యార్థులకు ఆంగ్ల తెలుగు డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్, విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ గంపా అశోక్ కుమార్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, సభ్యులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున సంస్థ ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు హాజరై విద్యార్థులు వారి భవిష్టత్తు గురించి మంచి కలలు కణాలని, కష్టపడి చదివి వారి భవిష్యత్తుకు వారే బాటలేసుకోవలని కన్న కలలు నెరవేర్చుకోవలని, భారత మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి స్పూర్తితో పెద్ద పదవులు పొంది ప్రజలకు సేవ చేయాలని ప్రక్కదారులు పట్టకుండా ఆశయాభివృద్ధికి పాటుపడాలని ఉద్బోధించారు. వారి ప్రసంగానికి ముగ్ధులైన విద్యార్థులు తాము కష్టపడి చదివి కన్నవారి కలలు నెరవేర్చి తాము పోటీ పరీక్షలలో విజయం సాధించి ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, డాక్టర్స్, ఇంజినిర్స్, దేశాన్ని రక్షించే సైనికులగుతామని, కొందరు యువతను తీర్చిదిద్ధి భావి తరాలకు మంచి సంస్కారవంతులైన ప్రజాసేవ చేయు అధికారులను సృష్టించే ఉపాధ్యాయులమవుతామని ప్రతిన భూనారు. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాలు నిర్వహించుచున్న అవోపా హనుమకొండ వారిని విద్యార్థులను ఉత్తేజ పరచిన పోకల చందర్ గారికి  తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయు చున్నవి.


కామెంట్‌లు