ప్రతిభా వంతులైన విద్యార్థులకు వాసవి సేవాకేంద్రం వారి స్కాలర్షిప్స్


తేదీ 16.2.2020 రోజున వాసవి సేవాకేంద్రం హైదరాబాద్ వారు రు.80,000 ల స్కాలర్షిప్స్ 154 మంది అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొల్లం సంపత్ కుమార్ చేతుల మీదుగా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు, పూర్వాధ్యక్షుడు, లయన్స్ క్వెస్ట్ గవర్నర్ శ్రీ పోకల చందర్, వరంగల్ వ్యాపారవేత్త, అడ్వొకేట్ శ్రీ గట్టు మహేశ్ బాబు, వాసవీ సేవా కేంద్రం అధ్యక్షుడు శ్రీ కాసనగొట్టు రాజశేఖర్ గుప్త, ట్రస్టీలు శ్రీ బొగ్గారపు దాయానంద్ మరియు శ్రీ కొండ్లే మల్లికార్జున్ తదితరులు హాజరైనారు. 


కామెంట్‌లు