అవోపా హబ్సిగూడా వారి జయంత్యుత్సవాలు


తేదీ 2.5.2020 శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. ఈ నాటి విపత్కర పరిస్థితుల్లో అమ్మవారి జయంత్యుత్సవాలు జరుపలేక పోవుచున్నామన్న బాధతో అవోపా హబ్సిగూడా వారు అమ్మవారి పూజను వారి వారి ఇండ్లలోనే చేసుకొమ్మని మరియు వాసవీ మాత పారాయణం సామూహికంగా వారి వారి ఇండ్లలోనే సరిగ్గా 11.30 గంటలకు మీదలెట్టాలని వీడియో లింకును అందరికి పంపించి పిలుపునిచ్చారు. తదనుగుణంగా అందరూ వారి వారు ఇంట్లో అమ్మవారి పూజను భక్తి శ్రధ్దలతో జరుపుకున్నారని అవోపా హబ్సిగూడా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శులు భవాని ప్రసాద్, హరి ప్రసాద్ మరియు ప్రాజెక్టు చైర్మన్ మద్ది హనుమంతరావు ఒక ప్రకటనలో వివరించారు. పూజను జయంత్యుత్సవాలను జరుపుకున్న అందరిని అమ్మ వాసవాంబ చల్లగా చూడాలని కరోన మహమ్మారిని మన రాష్ట్రాల నుండి తరిమి వేయాలని, మానవాళిని రక్షించాలని రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ వేడుకొనుచున్నవి.


కామెంట్‌లు