మంచిర్యాల జిల్లా మరియు లక్సెట్టిపెట్ టౌన్ అవోపా సంయుక్తంగా నిర్వహించిన వాసవి మాతా ఆత్మార్పణ దినోత్సవం


మంచిర్యాల జిల్లా ఆవోపా, లక్సట్టిపేట్ పట్టణ ఆవోపా ఆధ్వర్యములో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవము స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వేద బ్రాహ్మణులు రామకృష్ణ శాస్త్రి వాసవి మాతకు నూతన వస్త్రాలంకారణ చేసి వేద మంత్రములచే 102 గోత్రముల తో పూజ గావించారు. యీ కార్యక్రమములో ఆవోపా జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ పట్టణ ఆవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, అవోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండ ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి వొజ్జెల రాజమౌళి, జిల్లా కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పాలకుర్తి వెంకటేశ్వర్లు, అవోపా ప్రధాన కార్యదర్శి అక్కనపెల్లి రవీందర్,  నాయకులు గుండ సంతోష్, బొదుకూరి సత్తయ్య, ఉతురీ జయం, అక్కన పెల్లి కొటయ్య, మహిళలు తదితరులు పాల్గోన్నారు.


కామెంట్‌లు