గాంధీ గారికి అవోపా కామారెడ్డి వారి నివాళులు


నేడు మహాత్మాగాంధీ గారి వర్ధంతి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పరిషత్ భవన ప్రాంగణం లోని గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు పూలమాల  సమర్పించి నివాళులు అర్పించే కార్యక్రమం ఉదయం  10 గంటలకు   నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ జాతికి ఉపదేశించిన అత్యుత్తమ మార్గాలైన అహింస, శాంతి, ద్వారా ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలమని, భారత పౌరులందరూ జాతి సమైక్యతకు తమ వంతు కృషి చేయాలని వారు ఉపదేశించిన మార్గమే వారిని నేడు జాతిపితగా భావితరాలకు పరిచయం చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆర్థిక కార్యదర్శి గంగా ప్రసాద్లతో పాటు సత్య సేన సంతోష్, శ్రీనివాసన్, మురళి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు