నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

 


నాగర్ కర్నూల్ యూనిట్ అవొప వారు అధ్యక్షుడు ఫణికుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర అవొప ఉపాధ్యక్షుడు పోల శ్రీధర్ మాట్లాడుతూ గత 20 సంవత్సర లనుండీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం అభినంద నీయమంటూ ఆర్యవైశ్య పేద విద్యార్థుల  వివరాలు సేకరిస్తే వారికి అవసరమైన సహాయం అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయి కృష్ణ, ఫైనాన్స్ సెక్రెటరీ రవిప్రకాష్,  డా. లక్ష్మణ్, ఎంపీడీఓ కోటీశ్వర్, ఎస్. శ్రీధర్, బలరాముడు, మాజీ అధ్యక్షులు బొద్దుపాండు, రాజయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు