మహాత్మ గాంధి 72వ వర్దంతి సంధర్బంగా కృష్ణవేణి స్కూల్ లో 8, 9,10వ క్లాసు విద్యార్థినీ విద్యార్థులకు మంచిరియాల్ జిల్లా మరియు లక్సట్టిపేట్ పట్టణ ఆవోపాల ఆద్యర్యములోగాంధీజీ గారికిష్టమయిన రామాయణము, మహాభారతము నుండి క్విజ్ పోటీ నిర్వహించడం జరిగినది. ఈ క్విజ్ లోనాలుగు పాఠశాలల నుండి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు సృజనాత్మకను, నైతిక విలువలను పాటించడానికి, మానవతా విలువలు పెంపొందించడానికి, సమాజంలో పిల్లలు క్రమశిక్షణతో మెదులుటకు, ఎల్లప్పుడూ సత్యం పలకడానికి అహింస పద్ధతులు పాటించడానికి ఉద్యుక్తులవుతారని ఈ క్విజ్ పోటీని నిర్వహించామని జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ అన్నారు. క్విజ్ లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతుల ప్రధానము గావించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కృష్ణవేణి స్కూల్ శ్రీ చంద్ర శేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈకార్యక్రమములో అవోపా పట్టణాధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, పట్టణ ప్రదాన కార్యదర్శి అక్కనపెల్లి రవీందర్, ఎల్లంకి సత్తయ్య, రిటైర్డ్ టీచర్ సుబ్బాయమ్మ, ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్, కృష్ణమాచారి, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు మరియు సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
This is header
• Avopa News Bulletin
This is footer
మహాత్మాగాంధీ కి మంచిర్యాల జిల్లా అవోపా, పట్టణ లక్షెట్టిపెట్ అవోపా వారి నివాళులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి