రక్త దాన శిబిరం


వైస్ప్రో ఇండియా ఇంతవరకు విద్యాదానం, ధన దానం చేయడం తెలుసు. ఇప్పుడు రిపబ్లిక్ డే మరియు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా జనవరి 26, 2020 ఆదివారం రోజున మన వైస్ప్రొ ఇండియా స్వంత భవనంలో  రక్త దాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్త దానం చేయగొరే సభ్యులు తమ పేర్లను ఈ క్రింది నిర్వాహకుల వద్ద నమోదు చేసుకోవలసినదిగా కోరు చున్నాము.


CA Bachu Srinivas Project Chairman- 9391010567
CA R Laxmanjee - project Co Chairman- 9912384222
B Praveen Kumar - Project Co Chairman-9441820017
K. Rajanikanth- Project Co Chairman - 9849031122


ఇక్కడ రక్తదానంకి సంభందించిన కొన్ని విషయాలు క్రోడీకరించి చెప్పడం జరిగింది. సభ్యులు చదివి అవగాహనకి రావలసిందిగా మనవి.


 రక్తదానం - అవగాహన


మనలో ఎంత రక్తం ఉంటుంది?
మగవారిలో కె.జి. బరువుకు 76 మిల్లీలీటర్ల చొప్పున, ఆడవారిలో 66 మిల్లీలీటర్ల చొప్పున ఉంటుంది. కిలోగ్రాము శరీర బరువుకు 50 మి.లీ. రక్తం రక్తప్రసరణకు అవసరం. మిగిలినది అదనం.


ఎంత రక్తాన్ని దానం చేయవచ్చు?
శరీర బరువులో కే.జి.కి 8 మిల్లీ లీటర్లు చొప్పున దానం చేయవచ్చు. అదనంగా ఉండే రక్తంలో ఇది కొంత భాగం మాత్రమే.


భారతదేశంలోని వ్యక్తులు ఎంత రక్తాన్ని దానం చేయవచ్చు?
బరువునుబట్టి ఒకసారికి 350/450 మిల్లీ లీటర్లు వరకు రక్తదానం చేయవచ్చును.


రక్తదానం తరువాత మంచి ఆహారం, మందులు మరియు విశ్రాంతి అవసరమా?
అవసరం లేదు. సాధారణ ఆహారం చాలు.
రక్తాన్ని దానం చేసిన అరగంట తరువాత యధావిధిగా విధులు నిర్వర్తించుకోవచ్చు. రక్తదానం చేసిన రోజున జిమ్ , పరిగెత్తడం, అధికశ్రమ చేయరాదు.


రక్తదానాల మధ్య కాలవ్యవధి ఎంత ఉండాలి?
రక్తదానం చేసిన 3 నెలల తదుపరి తిరిగి రక్తాన్ని దానం చేయవచ్చు. ఒక వ్యక్తి 18 సం" - 65 సం" మధ్య జీవితకాలంలో 188 సార్లు రక్తాన్ని దానం చేయగలరు.


రక్తనిధివారు రక్తాన్ని సేకరించిన తరువాత ఏఏ పరీక్షలు నిర్వహిస్తారు?*
రక్తగ్రూపు నిర్ధారణ, మలేరియా, హెపటైటిస్ B,C. సిలిఫిస్ మరియు ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు.మామూలుగా పై పరీక్షలు చేయించుకోవాలంటే 1,000రూ" వరకు ఖర్చు అవుతుంది. కానీ రక్తదాన శిబిరంలో ఉచితంగా ఈ పరీక్షలు చేస్తారు


రక్తదానం - ఉపయోగాలు


1. రెగ్యులర్ వ్యవధిలో రక్తదానం చేయటం వలన శరీరంలో ఇనుము యొక్క శాతం క్రమబద్ధం చేయబడుతుంది మరియు గుండెపోటు నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.


2. రక్తదానం వలన మీ శరీర భాగాలను క్యాన్సర్ ప్రమాదం నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.


3. రక్తదానం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.


4. శరీరంలో చాలా కేలరీలు, కొవ్వు పదార్ధం కరుగుతాయి మరియు మొత్తం శరీరం యొక్క ఫిట్నెస్ మెరుగుపడుతుంది.


5. రక్తం దానం వలన ఒక వ్యక్తి జీవితం రక్షింపబడటం మాత్రమే కాదు, దీనివలన దాత శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.


6. రక్తప్రసరణ మెరుగుపడుతుంది


రక్తదానం చేయటం వలన రక్తనాళాల గోడలు ప్రమాదానికి గురవటం తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.


8. ఎక్కువ కాలం జీవిస్తారు


రక్తదానం చేయటం వలన, జీవితకాలం పెరుగుతుంది.
 ''హెల్త్ సైకాలజీ'' వారు పరిశోధనలు జరిపి, రక్తదానంలో తరచుగా పాల్గొనేవారు, వారి జీవితకాలానికంటే 4సంవత్సరాలు అదనంగా జీవించారని తెలిపారు.


 కావున మీరు కూడా రక్తదానాన్ని చేస్తూ, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ, జీవితకాలాన్ని పెంచుకోండి.


      ఇలా రక్తదానం చేయటం వలన మీ జీవితకాలం, ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మరొక వ్యక్తి జీవితాన్ని కాపాడినవారు అవుతారు.


           కావున ఇలాంటి కార్యాలలో పాల్గొని మీ వంతు విధిని నిర్వహించి, తోటివారికి ఆదర్శప్రాయంగా నిలవండని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము కోరుచున్నవి. 


Madhumohan                       Er R. Srinivasa Rao                             CA GURURAJ G


PRESIDENT                            GENERAL SECRETARY                        TREASURER  


9848160363                           9849030308                                         99499 01000   


 


 


 


 


కామెంట్‌లు